వచ్చినది కాదనక, లేనిది కోరక, సమ్యక్ జ్ఞానముతో, ఇచ్ఛ, నిర్ణయములతో పనిలేక, కర్త కాక, భోక్త లేక, ఇది అని చెప్పేవాడు లేక,
ఉన్నవాడె కదా! సాక్షి.
ఆచారాన్ని వ్యక్తీకరిస్తే బోధరూప జ్ఞానం అవుతుంది
ఆచరించు బోధించు బోధద్వార స్థిరపడు
స్థిరపడి విచారణ కూడా లేనిదే అని సహజంగా ఉండు
సహజమైతే నీవు లేవు,
స్థిరపడి విచారణ కూడా లేనిదే అని సహజంగా ఉండు
సహజమైతే నీవు లేవు,
నీది అనేది ఎప్పుడో పోయింది
ఉన్నది అంత లేనిదే.
ఉన్నది అంత లేనిదే.
శూన్యమే సర్వమయెను,
సర్వము శూన్యమగును,
యెంచిచూడ శూన్య సర్వము లొక్కటి యగు నీవు లేని చోట ...