Wednesday, 26 October 2011

శ్రీ సాయి ఆదేశాలు

 
శ్రీ సాయి ఆదేశాలు
నా  మార్గం లో అడుగుపెట్టి చూడు  - నీ  దారులన్నీ తెరువక పోతే  అడుగు
నా  కోసం  ఖర్చుపెట్టి చూడు  - కుభేరనిధి  తెరువక పోతే  అడుగు 
నా కోసం నిందలు పడి  చూడు  - నా  అనుగ్రహం  కురవక పోతే  అడుగు  
నా  వైపు వచ్చి చూడు - నీ క్షేమం చూడకపోతే  అడుగు 
నా  విషయం ఇతరులకు  చెప్పి  చూడు  - నిన్ను పూజ్యునిగా మార్చక పోతే అడుగు  
నా  జీవనాన్ని మననం చేసి చూడు  -  నీలో జ్ఞానం  నింపక పోతే  అడుగు 
నన్ను నీ  తోడుగా  చేసికొని చూడు  - బంధాలనుండి  విముక్తుడిని  చేయకపోతే అడుగు 
నాకోసం  నిండుగా ఏడ్చి చూడు  - ఆనందంలో  నిన్ను  ముంచక పోతే అడుగు 
నా  కోసం  ఏమైనా  అయి చూడు  - నిన్ను  ఉన్నతుడిని  చేయక పోతే అడుగు 
నా  మార్గంలో  నడచి చూడు  -  నిన్ను  శాంతిదూతను  చేయకపోతే  అడుగు  
నిన్ను  నువ్వు  త్యాగం  చేసికొని  చూడు  - సంసారసాగరం  దాటించక పోతే  అడుగు 
నీవు  నావాడవై  చూడు  - అందరిని  నీ వారిగా  చేయకపోతే  అడుగు 

షిరిడి సాయి : http://www.youtube.com/watch?v=0H3jhSZi5z0

సర్వం  సాయిమయం  జగత్  

ఓం  సాయి  శ్రీ  సాయి  జయ  జయ  సాయి 

సాయినాథ పాహి !!